ఢిల్లీ, మహా
తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీపై ఎక్స్ వేదికగా ఖర్గే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీపీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ పని తీరుపై ఈ భేటీలో లోతైన సమీక్ష చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గు గనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.







