Mahaa Daily Exclusive

  ఈ నెల 25 నుంచి ఇంటర్​ పరీక్షలు – రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు హాల్‌టికెట్లు

Share

హైదరాబాద్, మహా
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25న ఇంటర్​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేశారు. తొలిసారిగా విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్​కు ఇంటర్మీడియట్ బోర్డు హాల్​ టికెట్లు పంపింది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. కళాశాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా హాల్ టికెట్లు తీసుకునే అవకాశం కల్పించారు. 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్​ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్​​ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న ఫస్ట్ ఇయర్, 26వ తేదీన సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల కాలపట్టికను ఇంటర్‌ బోర్డు గతంలో విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.

Latest