- న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సుదర్శన్ రెడ్డి.!
- తనను మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించాలి
- ఆసక్తిగా ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం!
రంగారెడ్డి జిల్లా (ఇబ్రహీంపట్నం) మహా:
తనను మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించాలని సుదర్శన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ ఎన్నిక సమావేశంలో ఆర్వో సమక్షంలో 15 మంది సభ్యులు తమకు మద్దతు పలికారని, తనను ఛైర్మన్ గా ప్రకటించి, వైస్ ఛైర్మన్ ఎన్నిక చేపట్టేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటయ్యేలా ఆదేశాలివ్వాలని, గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఏడవ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ నాటకీయ పరిణామాలకు దారితీసాయి. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తారా? చిక్కుముడి వీడుతుందా..? అని ఆసక్తిగా పట్నం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Post Views: 10








