ఆదిలాబాద్ మహా : పార్టీలో కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని పదవులు వాటంతటవే వస్తాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవారం మావల రైతువేదికలో జరిగిన ఆత్మకమిటీ చైర్మన్ సంతోష్ రావు ప్రమాణ స్వీకారం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సంతోష్ రావు పనిపట్ల నిబద్ధత కలిగిన నాయకుడని రైతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేసేలా పని చేస్తాడని ఆయన ఆకాంక్షించారు.అటు తనపై నమ్మకంతో చైర్మన్ పదవి వచ్చేలా చేసిన కంది శ్రీనివాస రెడ్డికి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పని చేస్తానన్నారు. బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గజేందర్ సంతోష్ కు చైర్మన్ పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు సంతోష్ రావుకు అభినందనలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, – సతీష్,మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.








