Mahaa Daily Exclusive

  ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్… ట్రంప్ సంచలన ప్రకటన

Share

 

మహా
అమెరికాలో ఏలియన్స్, యూఎఫ్ఓ(అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్)లకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన రహస్య ఫైళ్లను గుర్తించి.. వాటిని బహిర్గతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో గ్రహాంతర వాసుల ఉనికిపై దశాబ్ద కాలంగా సాగుతున్న అమెరికన్ల ఉత్కంఠకు తెరపడనుంది. ప్రజల్లో ఈ రహస్యాల పట్ల ఉన్న ఆసక్తిని తీర్చాలని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.

Latest