Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ నియోజకవర్గం ఎర్రమంజిల్ డివిజన్, ద్వారకాపురి కాలనీలో ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నిశాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమస్యలపై సమరం పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు..

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం ఎర్రమంజిల్ డివిజన్, ద్వారకాపురి కాలనీలో ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నిశాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమస్యలపై సమరం పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.

ద్వారకాపురి కాలనీలో పేరుకుపోయిన చెత్త, శానిటేషన్ సమస్యలు, పనిచేయని GHMC స్ట్రీట్ లైట్లపై స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

వెంటనే GHMC SFA రంగారెడ్డి గారితో మాట్లాడి, తక్షణమే క్లీనింగ్ చేపట్టాలని కోరారు. స్పందించిన అధికారులు రేపు ఉదయం వరకు క్లీనింగ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే నాగార్జున సర్కిల్ ఫ్లవర్ షాపుల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు, ఓపెన్‌గా ఉన్న ఎలక్ట్రికల్ బాక్స్ సమస్యను ఎలక్ట్రికల్ AE, బంజారాహిల్స్ వారితో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.

రోడ్డు సమస్య కొరకు జిహెచ్ఎంసి ఏఈ భరత్ గారితో మాట్లాడి తక్షణమే రోడ్డు వేయాలని కోరడం జరిగింది

సానుకూలంగా స్పందించిన అధికారులు ఒకటి రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ప్రజల మధ్యనే MGR గారి సమస్యలపై సమరం!

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిట్ల శ్రీనివాస్ రాజు, ద్వారకాపురి కాలనీ ప్రెసిడెంట్ రవి కిషోర్, రాజేష్ యాదవ్, అజీజ్, చోటు, భరత్, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest