Mahaa Daily Exclusive

  అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట..! రూ.50 లక్షలతో కంపోస్టింగ్ షెడ్‌ కు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్..

Share

  • రూ.50 లక్షలతో కంపోస్టింగ్ షెడ్‌ కు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
  • పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

పెద్దపల్లి, మహా ;

పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న కంపోస్టింగ్ షెడ్‌కు ప్రభుత్వ విప్ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కంపోస్టింగ్ షెడ్ ఉపయోగపడుతుందని తెలిపారు.
అనంతరం పెద్దపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
తదుపరి పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పాల్గొని పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాల పై చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని 15వ వార్డు పూసాలలో, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి, 27వ వార్డు సుభాష్‌నగర్, 25వ, 33వ వార్డుల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం, పట్టణాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు.