Mahaa Daily Exclusive

  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Share

  • ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
  • నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి లేఖ

హైదరాబాద్, మహా: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వారిని ప్రైవేటు ఏజెన్సీలు నియమించడం వల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ప్రైవేటు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలను ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇవ్వడం లేదు. సుమారు 20శాతం వరకు వేతనాల్లో కోత విధించడంతో పాటు.. జీతాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణలో కూడా అదే తరహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’ అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చిన్నారెడ్డి వివరించారు.