Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Share

హైదరాబాద్, మహా : జూబ్లిహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ హస్తం గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత ,అభ్యర్థి నేరుగా మజ్లిస్ అధినేత దగ్గరికి వెళ్లి కలిసినట్లు రాంచందర్ రావు పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు గత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పొలిటికిల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయన్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్ తో చెట్టాపట్టాల్ వేసుకుని మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారిపోయిందన్నారు. పాతబస్తీలో అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ తో స్నేహహస్తం చాచినట్లు మజ్లిస్ అధినేత వివరణ ఇచ్చుకున్నారన్నారు. సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ పార్టీ అధినేతగా ఉన్న సమయం నుంచి కాంగ్రెస్ తో మజ్లిస్ కు మంచి సంబంధాలు కొనసాగాయని గుర్తు చేశారు.