Mahaa Daily Exclusive

  కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల ఫైర్ …!

Share

కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నాడని, ఐదు ఏండ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి కూడా లేదని, అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. పామ్ హౌస్ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాప్ పడిపోయిందని కార్యకర్తల ముందు అంటున్నాడని, కేవలం కార్యకర్తలను ఉత్తేజ పర్చడానికే కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అంటున్నాడని, ఆయనకు చిత్త శుద్ధి ఉంటే అపొజిషన్ లీడర్ గా అసెంబ్లీ కి వచ్చి ప్రజల సమస్యలు చర్చించే వాడన్నారు.
……
రేవంత్ రెడ్డి ని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదు- కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదని, కేసీఆర్ బిజేపి లో వాలిపోవడం ఖాయమని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ తో రాజకీయ ఒప్పందమే బీఆర్ ఎస్ ను ముంచిందని, బండి సంజయ్ కేంద్ర మంత్రా లేక మూర్ఖపు మనిషా అర్థం కావట్లేదన్నారు. ముస్లిం ల మీద విషం చిమ్మితే హిందుత్వం బలపడుతదని బండి సంజయ్ అనుకుంటున్నాడని, తెలంగాణ ప్రజల్ని వంచించిన మిమ్ముల్ని అక్కున చేర్చుకుంటారనేది కల్ల అని అన్నారు.
భవిషత్తు లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ దే రాజకీయమని, బీఆర్ఎస్ కు తెలంగాణ లో భవిషత్తు ఉంటదనుకోవడం భ్రమేనన్నారు.

Latest