Mahaa Daily Exclusive

  పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రాన్ని కోరాం: చంద్రబాబు

Share

పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలా సహకరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ‘పోలవరం కాల్వలకు చేసిన ఖర్చును రియింబర్స్‌మెంట్ చేయాలని అడిగాం. అలాగే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు మద్దతివ్వాలని కోరాం. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రంలో కరవు సమస్యలు తీరతాయని చెప్పాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Latest