Mahaa Daily Exclusive

  సీఎంగారు… మీలో పౌరుషం చచ్చిపోయిందా? – కేంద్ర మంత్రి బండి సంజయ్

Share

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషం, చీము నెత్తురు చచ్చిపోయినట్లుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు లో పర్యటించిన బండి సంజయ్ ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…. మీలో పౌరుషం చచ్చిపోయిందా? ఆనాడు మీ బిడ్డ పెళ్లినాడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా మిమ్ముల్ని అరెస్ట్ చేయించి జైల్లో వేయించిందన్నవ్ కదా? మిత్తీతో సహా చెల్లిస్తానని చెప్పినవ్ కదా? మరి ఈనాడు మీరే సీఎంగా ఉన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసు స్కాముల్లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని, ఆధారాలున్నాయని మీరే స్వయంగా చెప్పారు కదా? 14 నెలలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీలో నిజంగా పౌరుషం చచ్చిపోయిందా? అని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నూరులోని కేతన్ పల్లి ఎమ్మెన్నార్ గార్డెన్ లో మంచిర్యాల జిల్లా బీజేపీ ప్రభారీలతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ బలపర్చిన గ్రాడ్యుయేట్ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డితోపాటు స్థానిక నేతలతో కలిసి బండి సంజయ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

Latest