Mahaa Daily Exclusive

  ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు…!

Share

గతేడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ 8 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుండగా, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ రెండు సమావేశాలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహించనుంది

Latest