తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ బ్రాండ్లపై కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం.. అదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించనుంది.. అయితే.. అనుమతులకు ముందు నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనుంది. ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాలని టీజీబీసీఎల్ ప్రకటనలో తెలిపింది.
Post Views: 122







