Mahaa Daily Exclusive

  మహాకుంభమేళా ఐక్యతకు గుర్తు – భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి – ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక వేడుక : ప్రధాని మోదీ

Share

మహాకుంభమేళా ఐక్యతకు గుర్తుగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సంత్‌ల ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్పూర్‌లో బాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రధాని మోదీ ఎదురుదాడి చేశారు. బానిస మనస్తత్వం కలిగిన కొందరు ప్రజల విశ్వాసాలు, నమ్మకాలతో పాటు ఆలయాలపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ ధర్మం, సంస్కృతి అయితే సహజసిద్ధంగా ప్రగతిశీలంగా ఉందో దానిపై వారు బురదజల్లేందుకు సాహసం చేస్తారంటూ విమర్శించారు.

Latest