మంచిర్యాల, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇసుకను త్వరగా సరపర మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భువన కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను వేగంగా అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుకను టి.జి.ఎం.డి.సి. ఆధ్వర్యంలో అందించి, పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. పనులకు అవసరమైన కంకరను జీరో పర్మిట్ సిస్టమ్ ద్వారా వాహనాలకు వే-బిల్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 97







