Mahaa Daily Exclusive

  మెరుగైన సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలి -రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్..!

Share

ఆదిలాబాద్, మహా

సమాజంలో వైద్యులకు ప్రత్యేక స్థానం ఉందని, ఆ గుర్తింపును నిలబెట్టుకుంటూ నాణ్యమైన వైద్య సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ సూచించారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకుని మంగళవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియం లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు అందిస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం డైరెక్టర్ తో పాటు వైద్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. కేక్ కట్ చేసి డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు రోగులకు వైద్య సేవలందించారని తెలిపారు. సమాజంలో వైద్యులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. రిమ్స్ కు వచ్చే పేద రోగులకు అందుబాటులో ఉంటూ వారికి నాణ్యమైన వైద్యం అందించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కళ్యాణ్ రెడ్డి, శిరీష్, సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest