Mahaa Daily Exclusive

  దివ్యాంగుడి జీవనోపాధికి ఆర్థిక సాయం చేసిన కోడం శివ కృష్ణ హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగ నాయకులు..!

Share

వరంగల్ మహా;

తను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నిరుపేదలకు సేవ చేయడానికి పదవే అవసరం లేదని, సేవ చేయాలన్న తపన ఉంటే చాలని నిరూపించారు కొండా దంపతుల వీరాభిమాని కోడం శివకృష్ణ..
వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్ లోని అంకం సంపత్ అనే నిరుపేద దివ్యాంగుడు జీవనోపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారి చాలా కష్ట కాలంలో ఉన్న ఇతనికి జిల్లా దివ్యాంగుల సంఘం సహకారంతో పాటు జీవనోపాధి కై షాపును నడుపుకొనుటకు ఒక డబ్బాను ఇప్పించడం జరిగింది. దీనిలో ఇతను టైర్ల పంపుచార్ షాపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దివ్యాంగుడైన అంకం సంపత్ కు కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు కోడం శివకృష్ణ మంగళవారం టైర్ల పంపుచార్ షాపు నడుపుకొనుటకు కావలసిన పరికరాల తో పాటు టైర్లను, ట్యూబులను, గాలి పంపును తన సొంత ఖర్చులతో ఇప్పించి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా అంకం సంపత్, జిల్లా దివ్యాంగ నాయకులు కోడం శివకృష్ణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కోడం శివకృష్ణ రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని నిరుపేదలతో పాటు దివ్యాంగులకు అండగా నిలిచి ఇలాగే సహాయ సహకారాలు అందించాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యంగా నిరుపేద దివ్యాంగులకు జీవనోపాధి కల్పించుటకై మనసున్న దాతలు సహాయం చేయడానికి ముందుకు రావాలని శివకృష్ణ కోరారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘ నాయకులు బండి చక్రపాణి, గై సతీష్, బత్తిని రాజు, నీలం రాజు మరియు డివిజన్ కాంగ్రెస్ నాయకులు కత్తెర శాల శ్రీధర్, హుస్సేన్, బైరి ప్రతాప్,మిట్ట నిశాంత్, బొమ్మగాని శ్రీనివాస్, ఇట్టబోయిన సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Latest