వరంగల్ మహా;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ కంట్రోల్ టీం కు అందిన సమాచారం మేరకు మంగళవారం పోలీసులు డ్రగ్ అధికారి జన్ను కిరణ్ రంగశాయి పేట లోని ఆయుష్ మందుల షాపులో విస్తృతమైన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా మత్తు కలిగించే ప్రభుత్వ నిషేధిత దగ్గు మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున నిషేధిత దగ్గు మందులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు. ఈ తనిఖీల్లో ఆర్. ఐ శివ కేశవులు, ఆర్. ఎస్. ఐ మనోజ్, పూర్ణ, నాగరాజు తోపాటు యాంటీ డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సిబ్బంది, పాల్గొన్నారు.
Post Views: 36







