వరంగల్ మహా;
ఈనెల 4న గ్రామస్థాయి నేతలతో హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఓ సిటీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ గ్రామస్థాయి, డివిజన్ స్థాయి కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలనే ఆలోచనతో నిర్వహించ తలపెట్టిన సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ఎందుకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నాయకులు, కార్యకర్తలు, పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిలుగా నియమితులైన టి.పి.సి.సి. ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్ ,మోత్కూరి ధర్మారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు , కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.







