వరంగల్ మహా;
పారిశుధ్య నిర్వహణలో అలసత్వం లేకుండా చూడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం హన్మకొండ పరిధి లోని 31,7,8 డివిజన్ లలో శానిటేషన్ తనిఖీలతో పాటు వడ్డేపల్లి బండ్ పై స్మార్ట్ సిటీ పనులు ప్రశాంత్ నగర్ లోగల 15 ఏం ఎల్ డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కమిషనర్ క్షేత్ర స్తాయి లో సందర్శించి సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ
హనుమకొండ పరిధిలోని 30,7,8 డివిజన్ లలో గల హనుమకొండ మెయిన్ రోడ్డు, చౌరస్తా ప్రాంతాల్లో పర్యటించి గ్రీవెన్స్ లో స్థానికులు అందజేసిన ఫిర్యాదుల ఆధారం గా ఆ ప్రాంతం లో పర్యటించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డిసిల్టేషన్ ప్రక్రియ నిరంతరం జరగాలని మెష్ (జాలీ) లు ఏర్పాటు చేయాలని, ఆక్రమణలకు పాల్పడకుండా చూడాలని ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధించడం,తొలగించడం చేయాలని రోడ్డుమీద చెత్త వేస్తే జరిమానాలు విధించాలని ఆదేశించిన కమిషనర్ నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేసిన టీ స్టాల్ యజమానికి రూ.10 వేలు పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య సిబ్బంది తప్పకుండా రెయిన్ కోట్లు ధరించాలని సమయపాలన పాటించడంతో పాటు నాలుగుసార్లు థంబ్ వేయాలని ఆదేశించారు.
వడ్డేపల్లి బండ్ ను సందర్శించి స్మార్ట్ సిటీ స్కీమ్ లో భాగంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బండ్ మీద ఏర్పాటు చేయాల్సిన ప్లాంటేషన్ కు సంబంధించిన అంచనాలను తయారు చేసుకుని రావాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. బట్టర్ ఫ్లై పార్కులో ఉన్న సమస్యలను గుర్తించి అట్టి పనుల ను పునరుద్ధరించాలని అన్నారు. అనంతరం ప్రశాంత్ నగర్ లో గల 15 ఏం ఎల్ డి సామర్ధ్యం తో నిర్వహించబడుతున్న సీవెజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించి చేపడుతున్న ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకుని నిర్వహిస్తున్న రిజిస్టర్ లను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సి ఏం హెచ్ ఓ డా రాజారెడ్డి, హెచ్ ఓ రమేష్ , ఈ ఈ రవికుమార్, డి ఈ కార్తీక్ రెడ్డి, ఏఈ మేనక, సానిటరీ సూపర్ వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, తదితరులు పాల్గొన్నారు.







