రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి, స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ లోని అంద విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, పలహారాలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం, రైతుల కోసం పరితపించే వ్యక్తి అని వారు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు ఈ ఒక్కరోజు సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫౌండేషన్ వారు పరిసర ప్రాంతం కోసం వీధి దీపాలను కోరడంతో వారికి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా అంద విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాల కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంజమూరి రాం కాళేశ్వర్ రెడ్డి, దాసరి మురళీకృష్ణ, సొప్పరి టోనీ, శ్యామ్, జమాల్ పూరి శ్యామ్ లాల్, మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ ఇమ్రాన్, అయాన్ పటేల్, రవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.








