కాటారం, మహా :
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా రాంచందర్రావు ఎంపికపై భూపాలపల్లి బీజేపీ జిల్లా కౌన్సిలర్ బొమ్మన భాస్కర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వివాద రహితుడ సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి ఏబీవీపీ, సంఘ్ పరివార్ క్షేత్రాలలో జాతీయవాదిగా పనిచేశారని, పార్టీ శ్రేణులు అతని నాయకత్వంలో బి జే పీ బలోపేతమవుతుందని అన్నారు . రామచంద్ర రావు నేతృత్వంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందుతారని బిజెపి జిల్లా కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి అన్నారు.
Post Views: 118








