Mahaa Daily Exclusive

  డిసిసిబి చైర్మన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలకు లౌడ్ స్పీకర్లు అందజేత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ- కొత్తకుర్మ తిలక్..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
కొత్తకుర్మ సత్తయ్య జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తుర్కయంజాల్ మండలంలోని కమ్మగూడ ప్రాంతంలో ఉన్న ఏపీపీఎస్ శ్రీ శ్రీ నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో, టీజీకాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య జన్మదినం సందర్బంగా కొత్తకుర్మ తిలక్, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠశాల కోసం లౌడ్ స్పీకర్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సరదాగా వాళ్లతో గడపడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు కొత్తకుర్మ తిలక్ ను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ కాంగ్రెస్ నాయకుడు మేతరీ శంకర్, పాఠశాల ఉపాధ్యాయులు, అభిమానులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest