బోనకల్ మహా జులై.1
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల ప్రాథమిక వైద్యాధికారి డా. వేముల స్రవంతి అన్నారు. ఆమె మహా పత్రిక తో మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో చాలామంది బిజీ అయిపోయారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు. తక్కువ వయసులో బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె, కాలేయం తదితర సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవంచవచ్చునన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో
పాటు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
చెడు అలవాట్లను మానివేయాలని, పోషకాలతో కూడిన అప రం తీసుకోవాలని సూచించారు. వర్షా, లు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల దరూ తమ ఇంటి పరిసరాలలో నీరు ఉండకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశు భ్రతను పాటిం చాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, డాక్టర్ స్రవంతి గారు నిర్దేశం చేసారు .








