నేలకొండపల్లి, జూలై 1 మహా :
బైక్ అదుపు తప్పి… పల్టీకొట్టటంతో వ్యక్తి కి తీవ్ర గాయాలైయ్యాయి.
స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం లోని తొగరాయి కి చెందిన బీ. వేలాద్రి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం బైక్ పై ముదిగొండ మండలం లోని కమలాపురం వెళ్తున్నాడు. నేలకొండపల్లి మండలం లోని పాత కొత్తూరు మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి…. రోడ్డు పై పడ్డాడు. బైక్ రెండు విద్యుత్ స్థంబాల మధ్య నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలైయ్యాయి. హెల్మెట్ ఉండటం వలన రెప్పపాటు లో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ లో ప్రధమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.
Post Views: 88








