Mahaa Daily Exclusive

  మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాల బహుకరణ..!

Share

సత్తుపల్లి, జూలై 1: మహా.

పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఏప్రిల్ 1827లో మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరానితనం నిర్మూలన, స్త్రీ విద్య, కుల అసమానతలపై అలుపెరగని పోరాటం చేశాడని, బాలికల చదువులకు ప్రత్యేక పాఠశాలలు నిర్మించడంలో జ్యోతిరావు పూలే ఎనలేని కృషి ఉందని శ్రీనివాసరావు అన్నారు. జ్యోతిరావు పూలే రచనలతో అణగారిన కులాల యువతకు చైతన్యం తెచ్చాడని ఆయన సేవలు కొనియాడారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహాత్ముడు జ్యోతిరావు పూలే చిత్రపటాలు ఉండే విధంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో చిత్రపటాల బహుకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజల రాణి, నియోజకవర్గ అధ్యక్షుడు దోస వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల్లి శ్రీనివాసరావు, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ గౌడ్, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest