వరంగల్ మహా;
బల్దియా పరిధి లోని తిమ్మాపూర్ శివారు ప్రాంతం సర్వేనెంబర్ 125 లో అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ ను తొలగించినట్టు బల్దియా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖలీల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో తిమ్మాపూర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ నిర్మాణాలను తొలగించడం జరిగిందని ఏమైనా నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా బల్దియా అనుమతులు తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి పి ఎస్ లు అనిల్, అవినాష్, టి పి బి ఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 96








