Mahaa Daily Exclusive

  ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బొంతు రామ్మోహన్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన బొంతు రామ్మోహన్. బుధవారం చేవెళ్ల పట్టణ సమీపంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ లో పార్టీ అధ్యక్షులు, నాయకులు మరియు గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బొంతు రామ్మోహన్, నారాయణ పేట శాసనసభ్యులు పర్ణిక రెడ్డి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.
వారు మాట్లాడుతూ… జై బాపు, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్న సందర్భంగా పార్టీ అధ్యక్షులు, నాయకులు, గ్రామ కమీటీల సభ్యులు, పార్టీ ముఖ్యనాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Latest