Mahaa Daily Exclusive

  అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ల పట్టివేత పోలీసుల అదుపులో ట్రాక్టర్లు కేసు నమోదు సిఐ మాడుగుల ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న డాక్టర్లను పట్టుకున్న పోలీసులు. మాడుగుల పోలీసులు మంగళవారం రాత్రి రాజీవ్ నగర్ తండా గ్రామ శివారులో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో, మూడు ట్రాక్టర్లు వెళ్లడం గమనించిన పోలీసులు, అనుమానంగా ఉండడంతో ట్రాక్టర్లను ఆపి డ్రైవర్లను ప్రశ్నించగా, రాజీవ్ నగర్ తండాలోని చిన్న వాగు నుంచి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలపడంతో, వెంటనే ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల సిఐ వెల్లడించారు.

Latest