వరంగల్ మహా;
బల్దియా పరిధి లోని
కాలనీ లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం బల్దియా పరిధి 3వ డివిజన్ పైడిపల్లి కొత్తగూడెం లోని ఎస్ సి, బి సి కాలనీ లలో వర్షపు నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మేయర్ తో కలిసి డివిజన్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థానికులతో నేరుగా మాట్లాడిన అనంతరం వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను షిభారాణి, సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఈ ఈ సంతోష్ బాబు, స్థానిక నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 82








