AP: సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు సూచించారు. బుధవారం అమలాపురంలో నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్యారంటీ క్యూ ఆర్ కోడ్‌ను బొత్స ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల వివరాలు ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనిపిస్తాయని వెల్లడించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.
Post Views: 34








