ఆదిలాబాద్, మహా
విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన పొట్టేల్ సినిమాకు రాష్ట్ర స్థాయిలో టీజీఎఫ్ ఏం (తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్) వచ్చిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు ఉమ్మడి జిల్లాకు చెందిన సాహిత్ మోత్కూరిని పీఆర్టీయూ టీఎస్ నాయకులు సన్మానించారు. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని సంఘ భవనంలో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి, గౌరవ అధ్యక్షుడు డి. గోవర్ధన్, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.
Post Views: 42








