ఆదిలాబాద్, మహా : అన్నదానం మహా పుణ్య దానమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ద్వారా మూడున్నరేళ్లుగా చేపడుతున్న నిత్యాన్నదాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన వారికి ఆయన స్వయంగా వడ్డన చేశారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనస్సుతో కంది శ్రీనివాస రెడ్డి నిత్యాన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ ఎంతోమంది పేదల ఆకలి తీర్చుతూ నిత్యాన్నదాత గా పేరు సంపాదించుకున్నారన్నారు. ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఇలా కంది శ్రీనివాస రెడ్డి సేవాకార్యక్రమాలతో ఆయన పేరు జిల్లా అంతటా చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో
నాయకులు గిమ్మసంతోష్ , పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్,మాజీ కౌన్సిలర్లు సందా నర్సింగ్, జఫార్ అహ్మద్,సుధాకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు శాంతన్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, రావుల సోమన్న, మల్లయ్య యాదవ్,రాజేశ్వర్ ,శ్రీలేఖ, లతా, సోనియా మంథని, ప్రభావతి, ఉయిక ఇందిర తదితరులు పాల్గొన్నారు.








