Mahaa Daily Exclusive

  ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్

Share

ఆదిలాబాద్, మహా

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ. 8000కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఎత్తివేసే కుట్రను ఆపాలని, డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించి వాటిని మూసివేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో రాష్ట్ర సచివాలయం ముట్టడికి వెనుకడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు దీపా లక్మి, జిల్లా నాయకులు ఆశిష్,అఖిల్, మహేంద్ర, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మారుతి తదితరులు పాల్గొన్నారు.

Latest