రాజకీయాల్లో కొనసాగాలనుకునే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పట్టణ, మండల, గ్రామ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏ స్థాయి నాయకుడైనా ప్రజాభిమానం పొందాలంటే క్రమశిక్షణ తప్పనిసరని చెప్పారు. ఈనెల 4న హైదరాబాద్ వస్తున్నందున జిల్లా నుంచి భారీగా శ్రేణులను తరలించేలా కృషి చేయాలని సూచించారు.
Post Views: 60








