Mahaa Daily Exclusive

  14 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Share

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈనెల 14 నుంచి చేపట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ నెల 13 వరకు పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి కొత్తగా రేషన్‌కార్డులను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు.

Latest