వరంగల్ మహా;
వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల పరిధిలోని వనమాలకనపర్తి చెందిన సింగారపు మొండయ్య కుమార్తె సింగారపు ప్రియాంజలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరతో బాధిత కుటుంబానికి రూ. 2,25,000/-ల (రెండు లక్షల 25 వేల LOC ) కాపీని శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసన సభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి నా వంతు సహాయ సహకారం అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం
బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 47








