Mahaa Daily Exclusive

  కలెక్టరేట్ లో స్వర్గీయ దొడ్డి కొమురయ్య వర్ధంతి పాల్గొన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ..!

Share

వరంగల్ మహా;

స్వర్గీయ దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, అధికారులు, సంఘ నాయకులు, తదితరులు ఉన్నారు.

అనంతరం….
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య జయంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు. రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Latest