కాటారం, మహా :
సామాజిక న్యాయ సమరభేరి పేరుతో టిపిసిసి హైదరాబాదులో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కాటారం సబ్ డివిజన్లోని ఐదు మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోనే తొలిసారిగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తలతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఏఐటిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టిటిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మంథని నియోజక వర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళేందుకు దిశా నిర్దేశం చేశారు. జై బాబు జై భీమ్ జై సమ్మిదాన్ నినాదంతో నిర్వహిస్తున్న సమావేశానికి కాటారం, మహాదేవపూర్, పలిమేల, మలహర్రావు, మహాముత్తారం మండలాలకు చెందిన గ్రామ కమిటీల అధ్యక్షులు క్రియాశీలక నాయకులు, మండల పార్టీల అధ్యక్షులు సమావేశానికి తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం గారేపల్లి కూడలిలో కాంగ్రెస్ నాయకులంతా జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు, జై శ్రీను బాబు అంటూ నినదించారు. అనంతరం బస్సుల లో హైదరాబాద్ బహిరంసభ కు తరలివెళ్లారు.








