Mahaa Daily Exclusive

  జాతీయ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించాలి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..!

Share

వరంగల్ మహా;
జోనల్‌ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరచిన పోలీస్‌ అధికారులు జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. గత మూడు రోజుల నుండి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నిర్వహిస్తున్న భద్రాద్రి జోనల్‌ పోలీస్‌ డ్యూటీ మీట్‌ శుక్రవారం ఘనంగా ముగిసాయి. మూడురోజుల నిర్వహించిన ఈ డ్యూటీ మీట్‌లో జోనల్‌ పరిధిలో వరంగల్‌, ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్ల తో పాటు, మహబుబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్‌ అధికారులు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ లిప్టింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌,ప్రోపెషన్‌ ఫోటో మరియు వీడియోగ్రాఫీల్లో విభాగాల్లో పోటీపడ్డారు. ఇందులో ప్రతిభ కనబరిచన పోలీస్‌ అధికారులకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారుల చేతుల మీదుగా పతాకాలను అందజేసారు. ఇందులో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ విభాగానికి 15 గోల్డ్‌ మెడల్స్‌ సహా మొత్తం31 పతకాలను సాధించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం 19, మహబూబాబాద్‌ జిల్లాకు 17, ఖమ్మం 5పతకాలను సాధించారు. ఇందులో రాణించిన పోలీస్‌ అధికారులు త్వరలో వరంగల్‌ కమిషనరేట్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గోంటారు.
ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఇలాంటి డ్యూటీ మీట్‌ల ద్వారా వృత్తి నైపుణ్యాన్ని సాధించవచ్చని, కఠోర సాధన చేస్తే కేవలం వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కబరచవచ్చని. జోనల్‌ స్థాయిలో కబరిచిన ప్రతిభనే రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. విజయవంతంగా ఈ పోటీలను ముగించడంలో కృషి చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలియజేసారు. ఈ పోటీలను ఈ కార్యక్రమంలో డిసిపిలు షేక్‌ సలీమా, రాజమహేంద్ర నాయక్‌,అంకిత్‌ కుమార్‌, అదనపు డిసిపిలు రవి,సురేష్‌కుమార్‌,ప్రభాకర్‌రావు,బోనాల కిషన్‌, వరంగల్‌ ఏ.ఎస్పీ శుభంతో పాటు ఏసిపిలు, ఆర్‌.ఐలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఎస్‌.ఐలు, ఆర్‌.ఎస్‌.ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Latest