వరంగల్ మహా;
తడి పొడి చెత్తను వేరుగా సేకరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
మహా నగర పాలక సంస్థ వరంగల్ ప్రాంతంలోని పోతన నగర్ లో నిర్వహిస్తున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ ను కమిషనర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరు ను అధికారులను అడిగి తెలుసుకొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్వహిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు అవసరం మేరకు యంత్రాలకు మరమ్మతులు చేయించేలా చూడాలని ట్రాన్స్ ఫర్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని స్వచ్ఛ ఆటోలు తడి పొడి చెత్త ను వేయడానికి వీలు గా వేరుగా కంపార్ట్మెంట్లు ఉండేలా చూడాలని ఖచ్చితంగా ప్రజల నుండి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా ప్రోత్సహించి అవగాహన కలిగించాలని ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మరింత బలోపేతం చేసి చెత్త తరలింపులో వేగం పెరిగేలా చూడాలని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ మహేందర్, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఏ ఈ లు సంతోష్ కుమార్, ఫణి, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.








