Mahaa Daily Exclusive

  నరేంద్ర మోడీ వల్లనే భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగింది ఇంటింటికి పాజాప విజయాల కరపత్రాలు ..!

Share

మంచిర్యాల, మహా : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చలవ వల్లనే భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగిందని భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు పట్టణ పురవీధుల్లో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల కరపత్రాలను ఇంటింటికి, షాపు షాపుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుస్థిర సమర్థ పాలన వల్లనే ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంట్లో స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్ల పథకాన్ని అమలు చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని వెల్లడించారు. దేశంలో నిరు పేదలు ఆకలితో పస్తులు ఉండకూడదని భావించి తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆరోగ్య బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా ఏర్పాటు చేశారని తెలిపారు. (కోవిడ్-19) కరోనా వైరస్ కారణంతో యావత్ ప్రపంచ దేశాలు మందులు లేక తల్లడిల్లుతుంటే నరేంద్ర మోడీ సర్కార్ వివిధ దేశాలకు ఉచితంగా మందులు సరఫరా చేశారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో బాజాప మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్, రాష్ట్ర ఓబిసి సభ్యులు కొండపాక చారి, చెన్నూరు పట్టణ మాజీ అధ్యక్షులు జాడి తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత రాజేశ్వర్, గర్రెపల్లి వెంకట నరసయ్య, శ్రీనివాస్, మాణిక్ రావు, శంకర్, దుర్గ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Latest