మందమర్రి, మహా : సి.ఎం.పి.ఎఫ్ పెన్షన్ క్లెయిమ్స్ త్వరగతిన పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని సీఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ హరిపచారి స్పష్టం చేశారు. శుక్రవారం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏరియా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీ.ఎం.పి.ఎఫ్, పెన్షన్ లకు సంబంధించిన లావాదేవిలు అన్నీ సి-కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగు తున్నట్టు వెల్లడించారు.
అలాగే కొత్తగా సీ.ఎం.పి.ఎఫ్ పెన్షన్ కి సంబంధించిన క్లెయిమ్స్ త్వరగతిన పూర్తి చేయడానికి ప్రయాస్ అనే పద్దతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జీరో పెండింగ్ గా సీ.ఎం పి.ఎఫ్ పెన్షన్ సంబంధించిన క్లైములను సెటిల్ చేస్తున్నామని అన్నారు. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా సీ.ఎం.పి.ఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చునని వివరించారు. కార్మికులకు ఎలాంటి జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్, సి.ఎం.పి.ఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డి.వై.పి.ఎం ఆసిఫ్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, సీ.ఎం.పి.ఎఫ్ రీజినల్ కార్యాలయ సిబ్బంది,అన్ని గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








