ఆదిలాబాద్, మహా
సీజనల్ వ్యాధులతో పాటు టీబీ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని హమాలివాడ అర్బన్ పీహెచ్సీ వైద్యుడు రెహన్ అహ్మద్ అన్నారు. శుక్రవారం భూక్తపూర్లో హమాలీవాడ యూపీహెచ్ సి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులతో పాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఎక్స్ రేతో పాటు తెమడ, రక్తం, షూగర్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెహన్ అహ్మద్ మాట్లాడుతూ… వర్షా కాలం ప్రారంభమైందని, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతాయన్నారు. వాటి నివారణతో పాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ప్రజలకు వ్యాదులపై అవగాహన, పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బండారి సతీష్, హెల్త్ సెంటర్ సిబ్బంది నాగరాజు, రమాదేవి, సుమలత,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.








