ఆదిలాబాద్, మహా
ఆధిపత్య ధోరణికి, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య చేసిన ఉద్యమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొమురయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొమురయ్య చేసిన పోరాటాలు, చైతన్య కార్యక్రమాలను వివరించారు. మహానీయుల జీవిత చరిత్రను అందరికి తెలియజేసేలా ప్రభుత్వం వారి జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహిస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 71








