Mahaa Daily Exclusive

  ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని నక్షత్ర ఆసుపత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖి చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలు, చార్జీల బోర్డులు, కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ వ్యవస్థ, స్కానింగ్, డయాగ్నోస్టిక్ సర్వీసుల ప్రమాణాలు, ఆరోగ్య శ్రీ, ఇతర ఆరోగ్య బీమా సేవలు, డ్రగ్స్ రిజిష్టర్, మెడికల్ నిల్వల నిర్వహణ, రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో స్వయంగా మాట్లాడి… వారు పొందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఆసుపత్రుల భాద్యతను గుర్తుచేసే విధంగా, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా సేవలందించాలని కలెక్తర్ తెలిపారు. సందర్శనలో భాగంగా కొన్ని లోపాలను గుర్తించిన కలెక్టర్… ఆసుపత్రి యాజమాన్యానికి తగిన సూచనలు చేశారు. కార్డియాక్ కన్సల్టెంట్ డాక్టర్ పేరును డీఎంహెచ్వో ఆఫీసులో రిజిస్టర్ చేయనందుకు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విసిటింగ్ డాక్టర్స్ పేరును విధిగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రోగులకు సంబంధించిన బిల్లు ను ప్రింటేఢ్ కాపీలో ఇవ్వాలని సూచించారు. ధరల చాట్ ను స్పష్టంగా రెండు భాషలో పేషెంట్ కి స్పష్టంగా కనబడేటట్టు ప్రదర్శించాలని, రేట్ చాట్ కంటే అధిక బిల్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు సేవలు, ఇన్స్యూరెన్స్ పై రోగికి, వాళ్ళకి సంబంధించిన వారికి అవగాహన కలిగించాలని సూచించారు. స్కానింగ్ సర్వీసులకు సంబంధించిన అధికారిక సర్టిఫికేట్లు, లింగ నిర్ధారణ నిషేధం బోర్డు ప్రదర్శించాలని సూచించారు. మెడికల్ షాప్ ను తనిఖీ చేసి లైసెన్స్ కలిగిన ఫార్మాసిస్ట్ పని చేయాలని, షెడ్యూల్ ఎక్స్ క్యాటగిరికి సంబందించిన మందులకు లైసెన్స్ లేదన్నారు. షెడ్యూల్ హెచ్ 1 రిజిష్టర్ మెయింటైన్ చేయకపోవడం, తదితర లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ యాక్ట్ కి విరుద్ధంగా ప్రవర్తించే హాస్పిటల్స్‌ పై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన వ్యక్తి నుండి సమాచారం తీసుకున్న కలెక్టర్… వైద్యం చేయించుకున్న వ్యక్తితో ఫోన్ ద్వారా మాట్లాడారు. వైద్యసేవల విషయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా అధిక ఫీజులు వసూలు చేశారా అనే ప్రశ్నకు, సదరు వ్యక్తి “అలాంటిదేమీ లేదని, వైద్య సేవలు మెరుగ్గా అందించారని” వెల్లడించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, శ్రీధర్, డాక్టర్ సందీప్ ఐత్వార్, డాక్టర్ శిల్ప, ఆరోగ్య శ్రీ టీమ్ లీడర్, తదితరులు పాల్గొన్నారు.

Latest