ఆదిలాబాద్, మహా
తెలంగాణ సాయుధ పోరాటం లో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని సీపీఎం సీనియర్ నాయకుడు బండి దత్రాత్రి అన్నారు. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సామాజిక ఉద్యమాలలో ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. అనంతరం మెస్రం మనోహర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలం చుట్టుపక్క గ్రామాలలో ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గిరిజన నాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయకులు లంక రాఘవులు,సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, ఐద్వా నాయకురాలు లలిత. రాధా, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు








