మందమర్రి, మహా : వర్షాకాలంలో అన్ని రకాల ఉద్యోగులకు వైద్య పరీక్షలు అనివార్యమని స్థానిక మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పి హెచ్ సి వైద్యులు ఆర్ రమేష్ లు తెలిపారు. శుక్రవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మునిసిపాలిటీ ఔట్సోర్సింగ్ పారిశుద్య సిబ్బంది, మెప్మా స్వయం సహాయక సంఘాల సిబ్బంది, 24 వార్డుల ఆర్పి లకు
ల సౌకర్యార్థం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ రకాల సిబ్బంది కొరకు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు వారి నివాస పరిసర ప్రాంతాలలో వర్షాకాలంలో నీటి నిల్వ ఉండడం ద్వారా దోమలు కుట్టి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతినెలా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ వాసులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ ఎం సుమతీ, రెవిన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యం గోపికృష్ణ మెప్మా ఇన్చార్జి టీఎంసీ ఏ రఘురాం తదితర మున్సిపల్ సిబ్బందితో పాటు జూనియర్ డాక్టర్లు ఎం విష్ణు తేజ రెడ్డి, డాక్టర్స్ స్పందన, సూపర్వైజర్ ఎస్ కళావతి, హెల్త్ అసిస్టెంట్ లు సుజాత, రాజేశ్వరి ఆశా వర్కర్లు ఉన్నారు.








