Mahaa Daily Exclusive

  సీఎం అభ్యర్థిగా విజయ్‌ బీజేపీ, డీఎంకేలతో పొత్తులు ఉండవు తమిళగ వెట్రి కళగం(టీవీకే) కీలక ప్రకటన..!

Share

తమిళనాడు, మహా: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌ను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. తమ పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడిన ఆయన.. బీజేపీ విషపూరిత రాజకీయాలు తమిళనాడులో చెల్లవన్నారు. బీజేపీతో చేతులు కలపడానికి తమ పార్టీ ఏమీ డీఎంకే, అన్నాడీఎంకే కాదన్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండబోవని తేల్చి చెప్పిన విజయ్‌.. ఆ రెండు పార్టీలను తమకు సైద్ధాంతిక శత్రువులుగా పేర్కొన్నారు.

Latest